మండల బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల హామీలను విస్మరించిన సీఎం రేవంత్ రెడ్డి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గోల్డెన్ న్యూస్/ కరకగూడెం :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల హామీలను విస్మరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పై మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఈ సందర్భంగా విమర్శించారు.
Post Views: 129









