యూనివర్సిటీ భూముల వేలం ఆపాలి… రేగా కాంతారావు

గత రెండు రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయడం కోసం HCU లో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్న అటవీ ప్రాంతాన్ని నాశనం చేసి, ఆ భూములను వేలం వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది.

 రేగా కాంతారావు.

భూముల వేలం నిరసిస్తూ 3న టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.

ముఖ్యమంత్రి మీరు వేలం వేస్తున్నది HCU భూములను కాదు, హైదరాబాద్ ఊపిరితిత్తులను..

గోల్డెన్ న్యూస్ / మణుగూరు : ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం HCUకి 2300 ఎకరాల భూమిని ఇస్తే, నేడు అదే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భూములను అమ్మడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

పాలన చేతకాక, పన్నులు రాబట్టక, ఆదాయవనరులు కొల్లగొట్టి కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుచు భూములను అమ్మి కాలం వెళ్ళబుచాలని చూస్తున్న రేవంత్ రెడ్డి, ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి “ప్రభుత్వ భూమి ఒక గుంట కూడా అమ్మకుండా చూస్తాం” అని చెప్పి, నేడు యూనివర్సిటీ భూములు ఎలా అమ్ముతున్నారు..?

 

ఉద్యోగాలు భర్తీ చేయడం, పథకాలు ప్రజలకు అందించడం చేతగాక, ఈరోజు భూములను కాపాడాలని నిరసన తెలియజేసిన విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి రాష్ట్రంలో ఒక నిర్బంధకాండ నిరంకుశ పాలన కొనసాగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

ప్రజాస్వామ్య వాదులారా, పర్యావరణ రక్షకులారా… విద్యార్థులారా యువజనులారా ఈరోజు యూనివర్సిటీ భూములను కాపాడడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

 


భూముల వేలం ప్రక్రియను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి.

విద్యార్థుల మీద పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, విద్యార్థులకు మా పూర్తి మద్దతును తెలియజేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో తేదీ 03.04.2025 రోజున ఉదయం 11 గంటలకు నిరసన ధర్నా కార్యక్రమం చేయవలసిందిగా నిర్ణయించనైనది. ఈ కార్యక్రమంలో యువజన విభాగం మరియు విద్యార్థి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram