నేటి నుంచి కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలు

గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : కేంద్రియ విద్యాలయం 2020-2026 విద్యా సంవత్సరానికి రెండు నుంచి ఎనిమిది తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

ఖమ్మంలోని కేంద్రీయ విద్యాలయంలో ఏప్రిల్ 2 నుంచి 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

అర్హతలు .. రెండో తరగతి ప్రవేశానికి 1.04.2025 నాటికి ఏడు సంవత్సరాలు నిండి తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి. మూడో తరగతికి 8 నుంచి 10, నాలుగో తరగతి 9 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. 5వ తరగతికి 9 నుంచి 11 సంవత్సరాలు, ఆరో తరగతికి 10 నుంచి 12, ఏడో తరగతి 11 నుంచి 13, ఎనిమిదో తరగతి 12 నుంచి 14. ఏళ్ల వయసు ఉండాలి. ఏప్రిల్ 2 నుంచి 11 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న 3 గంటల వరకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. 18 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ తెలిపారు. తొమ్మిదో తరగతికి ప్రవేశాలు లేవని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram