గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ లోని దూల్ పేట మీదుగా అతి పెద్ద శోభా యాత్ర నిర్వహించను న్నారు ఈ శోభాయాత్రకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి శ్రీరామ భక్తులు యువకులు వేలాదిగా తరలివస్తున్నారు.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం శ్రీరామనవమి శోభాయా త్రపై పోలీసులు అంక్షలు అధికంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం సాయంత్రం శోభాయాత్రలు ప్రారంభం అవుతాయి.
అయితే ఈ సారి మాత్రం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే శోభాయాత్ర నిర్వహించాల ని పోలీసులు సూచించిన ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు*
దూల్ పేట్, సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల, వరకు ఈ శోభాయాత్ర సాగనుంది, సుల్తాన్ బజార్,మీదుగా బోయిన్ గూడ, హనుమాన్ జాలి, మంగళహాట్, పిఎస్,రోడ్డు దూల్ పేట్, పురానాపూల్, చూడి బజార్, బేగంబజార్, నుంచి వచ్చే వాహనాలను గోషా మహల్ ఇతర ఏరియాల వైపు మళ్ళిస్తున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.









