కరకగూడెం ఎస్ఐ రాజేందర్ బదిలీ..

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న  ఎస్ ఐ రాజేందర్  టేకులపల్లి కి బదిలీ అయ్యారు. కర్రకగూడెం ఎస్ఐగా బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి నేర పరిశోధన, శాంతి భద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేశారు. పోలీసుశాఖకు సంక్లిష్టంగా మారిన కేసులను పరిష్కరించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.. ఆయన స్థానంలో భద్రాచలంలో పనిచేసిన ఎస్సై పీవీ నాగేశ్వరరావు కరకగూడానికి కొత్తసైగా రానున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram