గోల్డెన్ న్యూస్ / బుగ్గారం : అనారోగ్య కారణాలతో బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుగ్గారం మండలం గంగాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపిని వివరాల ప్రకారం.. గంగాపూర్ గ్రామానికి చెందిన కట్ట గంగమ్మ (61) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. జీవితం మీద విరక్తి చెంది బుధవారం ఉదయం తన ఇంటి సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Post Views: 13