రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించబోతున్న వరంగల్ సభ.. మాజీ మంత్రి కేటీఆర్

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ సరికొత్త చరిత్రను సృష్టించ బోతోంది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓరుగల్లు వేదికగా జరగనున్న బీఆర్ ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.

 

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.అయితే, ప్రతి గ్రామంలో పార్టీ నేత లు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించి కదలి రావాలని కేటీఆర్ సూచించారు.

 

పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసు కున్న సందర్భంగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సభ కావడంతో, సభకు హాజరయ్యే వారు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని కోరారు. రాష్ట్ర నలుమూలల నుంచి సభకు తరలి రావాలనే ఉత్సాహం ప్రజల్లో పెద్ద ఎత్తున కనిపిస్తుంది..

 

వారందరినీ సమన్వయం చేసుకుని అనుకున్న సమ యానికి సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రణాళిక వేసుకోవాలన్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు తరలి వచ్చే ప్రతి వాహనానికి అన్ని వైపులా గులాబీ జెం డాలు కట్టుకుని ఉత్సా హంగా బయలుదేరాలని కేటీఆర్ సూచించారు.

 

ఇక, ఎండల వల్ల ఇబ్బంది లేకుండా ప్రతి బస్సులో మంచి నీళ్ల బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజన వసతు లకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కిండ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. తెలంగాణ నలువైపుల నుంచి తరలి వచ్చే వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఇప్పటికే రూట్ మ్యాప్ పంపించాం.. దానికి అనుగుణంగానే ఆయా రూట్లలో సభ స్థలికి చేరుకోవాలన్నారు.

 

సభా ప్రాంగణానికి 30 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్లపై ఎక్కడ వాహనాలు నిలపరాదు.. నేరుగా సూ చించిన పార్కింగ్ స్థలాలకు చేరుకొని వాహనాలను నిలపాలి.. అనేక ప్రాంతాల్లో పార్టీ వాలంటీర్లు ఎప్పటి కప్పుడు మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు.

 

చారిత్రక సభలో కేసీఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెల కొంది.. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram