జనన ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకుంటే మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారు

జనన దృవీకరణ పత్రానికి  దరఖాస్తు చేసుకుంటే,  మరణం ధ్రువీకరణ కరణ పత్రం మంజూరు చేశారు.

గోల్డెన్ న్యూస్ / ఖమ్మంజనన ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకుంటే మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసిన ఘటన కూసుమంచి మండల తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఆ వాక్కైనా లబ్ధిదారురాలు ఇదేమిటని  ప్రశ్నించగా ఎక్కువ మాట్లాడితే బయటికి పంపిస్తానని సదరు బాలిక తల్లిని అన్నట్లు బాధితులు వాపోతున్నారు. మండలంలోని  గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్, లక్ష్మి (మమత) దంపతులు. లక్ష్మి (మమత) కి 2022 నవంబర్ 12న కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ కాన్పులో ఆడబిడ్డ జన్మించింది. దీంతో బిడ్డకు జనన ద్రువీకరణ వత్రానికి సంబంధిత పత్రాలన్నీ జోడించి దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది తమవద్ద ఏ డీటెయిల్స్ ఆన్ లైన్ లో లేవని తెలపడంతో, తమ కూతురు కదారి మాదవిద్యకు ఆధార్ కార్డు తీయించాలంటే జనన ధ్రువీకరణ తప్పనిసరి కావడంతో కూసుమంచి పంచాయతీ కార్యదర్శిని కలిసి విషయం తెలవగా పంచాయతీ కార్యదర్శి ఇంకా మావద్దకు వివరాలు రాలేదు, మీ చరవాణి నంబర్ ఇవ్వండి మేమే మీకు విషయం తెలుపుతామని తెలిపారు. దీంతో కొన్ని రోజుల తరువాత మళ్లీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగీతిరిగీ సర్టిఫికెట్ ఉన్నా.. అధికారులు నమోదు చేయకుండా కాలయావన చేశారు.  ఆగస్టు నాలుగు తేదీన సదరు మహిళ తహసీల్దార్ కార్యాలయంకు వచ్చి తమ కూతురుకు సంబంధించిన జనన ద్రువీకరణ సర్టిఫికెట్ అడగగా.. సంబంధిత విభాగం చూసే కార్యాలయంలో విధులు నిర్వర్తించే గువ్వల వెంకటేశ్వర్లు సర్టిఫికెట్ సదరు మహిళకు అందజేశారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని ఫొటో తీసి తమ బంధువులకు పంపించగా. వారు ఆ సర్టిఫికెట్ పరిశీలించి అవాక్కయ్యారు. తమకూతురు మాదవిద్యకు జనన ధ్రువీకరణ పత్రం వచ్చిందని  తమ బంధువులకు తెలిపింది ఇదేంటి పిల్లకు డెత్ సర్టిఫికెట్ మంజూరు అయిందని తెలిపారు.  మహిళా వెంటనే సందరు ఉద్యోగి వద్దకు వెళ్లి నిలదీశారు. వెంటనే గువ్వల వెంకటేశ్వర్లు సదరు మహిళ చేతిలో ఉన్న సర్టిఫికెట్ గుంజుకుని ఆమె ఎదుటే చింపి  పడేశాడు. మరలా కంప్యూటర్ లో ఏదో సరిచేసి మరొక సర్టిఫికెట్ అందివ్వబోగా వారు తీసుకోకుండా ఇదేంటి ఇలా ఎలా ఇస్తారని ప్రశ్నించగా ఇది ఇవ్వడమే ఎక్కవ.. మరీ ఎక్కవ మాట్లాడితే బయటికి పంపిస్తా.. అంటూ దురుసుగా ప్రవర్తించారని బాధిత మహిళ వాపోయింది.

ఆసుపత్రి వివరాలు లేవంటే పట్టించుకోలేదు..

మంజూరైన సర్టిఫికెట్లో బాలిక ఎక్కడ జన్మించిందో వివరాలు లేవని, ఆ వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేస్తేనే ఆధార్ కార్డు రావడానికి అవకాశం ఉంటుందని సదరు మహిళ వారించినా పట్టించుకోకుండా సదరు ఉద్యోగి మహిళ అని కూడా చూడకుండా ‘ ఏ బయటికి వెళ్లు… ఏదైనా ఉంటే తహసీల్దార్ ను అడుక్కోపో.. అని కసురుకోవడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు

తహసీల్దార్ వివరణ..ఇదే విషయంపై కూసుమంచి తహసీల్దార్ రవికుమార్ ను ఫోన్ లో వివరణ కోరగా బర్త్ సర్టిఫికెట్ అని రావాల్సిన చోట డెత్ అని పొరపాటున వచ్చిందని సిబ్బంది. తెలిపారన్నారు. తాను బుధవారం కోర్టు పనిమీద కార్యాలయానికి రాలేదని, గురువారం దరఖాస్తు దారులను పిలిపించి సరిచేసి జనన ధ్రువీకరణ పత్రం అందిస్తామని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram