ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థిలకు సన్మానం

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : ఇటీవల నీట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఎంబీబీఎస్ అడ్మిషన్ సీటును సాధించిన కరకగూడెం మండల కేంద్రానికి  చెందిన ఆయేషా సమీరా, మరియు సయ్యద్  సమీనా ను కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల  అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ముస్లిం మత పెద్దలు శుక్రవారం జామా మసీదులో  ఘనంగా శాలువాతో సత్కరించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ..  కరకగూడెం మండలం ముస్లిం సమాజంలో మొట్టమొదటి మెడిసిన్ అడ్మిషన్ సాధించిన  విద్యార్థినులను అభినందించారు. సాధారణ కుటుంబానికి చెందిన విద్యార్థిని  సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకొని నీట్ లో ఉత్తీర్ణత సాధించడం నిజంగా హర్షించదగ్గ విషయమని ముందుగా వారి తల్లిదండ్రులకు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

రానున్న రోజుల్లో మరిన్ని ఉత్తమ ఫలితాలు కరకగూడెం  నుండి సాధించాలని ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులను ఆకాంక్షించారు. పిల్లలు అద్భుత విజయాలను సాధించినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ పెద్దలు, మస్జిద్ ఇమామ్ సాబ్ లు, యువకులు తదితరులు పాల్గొన్నారు…

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram