కోటి రూపాయల విలువైన డ్ర‌గ్స్ సీజ్..

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు అయ్యింది. న‌గ‌రంలో డ్ర‌గ్స్ దందా విచ్చ‌ల‌విడిగా కొన‌సాగుతోంది. నిన్న జీడిమెట్ల ప‌రిధిలోని సుచిత్రా క్రాస్ రోడ్స్‌లో రూ. 10 కోట్ల విలువైన డ్ర‌గ్స్‌ను సీజ్ చేసిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. తాజాగా మ‌రో డ్ర‌గ్ రాకెట్ గుట్టుర‌ట్టు అయింది. మ‌ల్కాజ్‌గిరి ఎస్‌వోటీ, కీస‌ర పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వ‌హించి రూ. కోటి విలువైన డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏడు కిలోల ఓపియం, 2 కిలోల పాపిస్ట్రా అనే డ్ర‌గ్స్‌ను సీజ్ చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram