ఆర్టీసీ బస్సు ప్రమాదానికి కారణాలివే.?

బస్సులో సురక్షితంగా ప్రయాణిస్తున్న వారిపైకి మృత్యు శకటంలా దూసుకొచ్చింది లారీ. ఏం జరుగుతుందో తెలిసేలోపే.. ప్రాణాలుపోయాయి. టర్నింగ్ పాయింట్.. ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలిపింది

 

అతివేగమే ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది.

 

టిప్పర్ లారీలోని కంకరే ఎక్కువ మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది.

 

కంకర ఒక్కసారిగా మీద పడటంతో.. ప్రయాణికులు ఎక్కువమంది చనిపోయారు.

 

పది మందికిపైగా కంకర కిందే సమాధి అయ్యారు.

 

ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు.

 

మృతుల్లో 18 మంది ప్రయాణికులు, ఇద్దరు బస్సు, టిప్పర్‌ డ్రైవర్లు ఉన్నారు.

 

ఏడాది పాప సహా 11 మంది మహిళలు, 9మంది పురుషులు మృతి చెందారు.

 

24 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

 

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

 

సీఎం రేవంత్. బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సీఎస్, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని , అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram