మా నాన్న ధర్మేంద్ర క్షేమంగానే ఉన్నాడు.. చనిపోయారనేది అబద్దం

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి చెందారంటూ మంగళవారం ఉదయం జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని ఆయన కుమార్తె ఈషా దేవోల్ ఖండించారు. తమ కుటుంబం చెప్పేవరకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దన్నారు. ధర్మేంద్రకు ముంబయి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పోస్టు పెట్టారు. “మా నాన్న క్షేమంగానే ఉన్నారు. మేం ప్రైవసీని కోరుకుంటున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ కృతజ్ఞతలు” అని ఈషా దేవోల్ పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram