లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన పట్టణ ప్రణాళికాధికాలు

గోల్డెన్ న్యూస్ /రంగారెడ్డి  :  పట్టణంలో జి+4 భవన నిర్మాణానికి అనుమతి జారీ చేసేందుకు లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతినిరోధకశాఖ (ACB) అధికారులు ఇద్దరు పట్టణ ప్రణాళిక అధికారులను పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, ఆదిబట్ల పురపాలక సంఘానికి చెందిన పట్టణ ప్రణాళిక అధికారి బందెల వరప్రసాద్ మరియు ఆయన సహాయకుడు వడాల వంశీ కృష్ణలు ఫిర్యాదుదారుని నుంచి రూ.75,000/- లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫిర్యాదుదారు భవన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా, అనుమతి జారీకి ఈ ఇద్దరు అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. అధికారులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ, లంచం మొత్తం సీజ్ చేసి, తదుపరి విచారణ చేపట్టింది.

Facebook
WhatsApp
Twitter
Telegram