హిజ్రాలలో వర్గ పోరు…ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రా
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బోరబండలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
తమ వర్గానికి చెందిన ఓ హిజ్రా కేసుల పేరిట వేధిస్తోందంటూ కొంతమంది హిజ్రాలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలోనే ఆవేశానికి లోనైనా ఓ హిజ్రా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది.
దీంతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది.
ముగ్గురు హిజ్రాలతో పాటు పోలీసులకూ గాయాలయ్యాయి.
క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Post Views: 51









