గోల్డెన్ న్యూస్ / ఆంధ్ర ప్రదేశ్ : తిరుమల కొండపై నుంచి తిరుపతికి వస్తున్న ఓ కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో మొదటి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది.
సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు.
ప్రమాదానికి గురైన వాహనానికి ముందు వెనుక వాహనాలు లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పిందని స్థానికులు వివరించారు. కారును అధికారులు తిరుపతికి తరలించారు.
Post Views: 50









