గాయపడిన శిశువు
గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీలింగ్ ఫ్యాన్ విరిగిపడి నవజాత శిశువు గాయపడిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్‌కు జన్మించిన ఆడబిడ్డపై ఆదివారం ఉదయం ఫ్యాన్ పడింది. శిశువుకు కుడిభాగంలో గాయాలవడంతో ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స అందించారు. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ సుమోటోగా కేసు నమోదు చేసి, జిల్లా వైద్యాధికారికి నివేదిక ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.
Post Views: 29









