ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండల కేంద్రంలోని జిల్లా పరిషత్  పాఠశాల ఆవరణలో  ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  మండల విద్యాశాఖ అధికారి  జి. మంజుల , కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు  టి. మోహన్ బాబు  గిరిజన పే సెంటర్ ప్రధానోపాధ్యాయుడు టి .రామచంద్ర రావు, దివ్యాంగుల ఉపాధ్యాయులు విజయ కుమారి, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఎంఈవో  మాట్లాడుతూ.. అవయవలోపాన్ని మరచి, స్వశక్తితో గర్వంగా జీవించేందుకు ప్రయత్నించాలన్నారు. అనంతరం ఎంఈవో మంజుల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు. పిఆర్సీలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram