గోల్డెన్ న్యూస్ / మహబూబాబాద్ / కొత్తగూడ మండలంలోని చిట్యాలగడ్డ గ్రామంలో అక్రమంగా నడుస్తున్న గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు…
ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో పెద్దమొత్తంలో గుడుంబా, తయారీ సామగ్రి, డ్రములు, కాస్టిల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీంతో గ్రామంలో గుడుంబా మాఫియాలో ఆందోళన నెలకొంది….అక్రమార్కులకు గట్టి హెచ్చరికగా ఈ చర్యలు నమోదయ్యాయి. గ్రామంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసుల చర్యలు కొనసాగుతాయని ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు…
స్థానిక ప్రజలు కూడా ఈ దాడులను స్వాగతిస్తూ, గుడుంబా వ్యాప్తితో విసుగు చెందిన తమకు ఇది ఉపశమనంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు
Post Views: 108









