గోల్డెన్ న్యూస్/ పినపాక / తనకు దొరికిన సొమ్మును బాధితుడికి అందజేసి ఓ కానిస్టేబుల్ తన నిజాయితీని చాటుకున్నాడు.
వివరాల్లోకెళితే…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ ఆదివారం పినపాక మండలం జానంపేటలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న రు ఈ క్రమంలో ఆయనకు రహదారిపై 5600 రూపాయల నగదు దొరికాయి. ఆ నగదు పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి , బాధితుడు లారీ డ్రైవర్ అని తెలుసుకుని ఆయనకు నగదు అందజేసి తన నిజాయితీని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను స్థానికులు అభినందించారు. ఆయన నిజాయితీని పలువురు ప్రశంసించారు..
Post Views: 98









