గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం నేటి సాయంత్రంతో గడువు ముగిసింది. ఎన్నికల ఉత్సాహం అభ్యర్థులకు టెన్షన్ గా మారుతోంది. ప్రచార మైకులు మోగడం ఆగిపోవడంతో, అభ్యర్థులు ఇప్పుడు రహస్యంగా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు, అశ్వాపురం, బూర్గంపహాడ్, భద్రాచలం, దుమ్ముగూడెం,పినపాక, చర్ల, కరకగూడెం మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 11 తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు 2 గంటల నుండి అధికారులు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు.
Post Views: 62









