నూతన సర్పంచ్లను సన్మానించిన ఎమ్మెల్యే

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను శుక్రవారం కరకగూడెం మండల కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధికి తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపును కృషి చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు అభినందించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు కీలకపాత్ర పోషిస్తారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమర్థవంతమైన పాలన అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, టిపిసిసి సభ్యులు చందా సంతోష్, టిడిపి మండల అధ్యక్షులు సిరి శెట్టి కమలాకర్, మండల కాంగ్రెస్ నాయకులు ఎర్ర సురేష్, తోలెం నాగేశ్వరరావు, పోలేబోయిన తిరుపతయ్య, నాగబండి వెంకటేశ్వర్లు, బిజ్జ రామనాథం, వట్టం సురేందర్, ఎట్టి నరసయ్య, కునుసోత్ సాగర్, ముంజాల సాయిబాబా,జలగం కృష్ణ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram