పంచాయతీ ఎన్నికల్లో విచిత్రం.. ఒక్క ఓటు కూడా పడని సర్పంచ్ అభ్యర్థి

 

రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. గెలుపు కోసం సర్పంచ్ అభ్యర్థులు ఎక్కని గడప లేదు అన్నట్లుగా ప్రచారం నిర్వహించారు. కొన్ని కోట్ల విలువైన మద్యం ఏరులై పారగా.. మరికొన్నిచోట్ల డబ్బు ప్రభావం పని చేసింది.

 

ఈ క్రమంలోనే ఈనెల 17న జరిగిన మూడవ మరియు తుది విడత ఎన్నికల్లో ఓ చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.

 

వరంగల్ జిల్లా ఖానాపురం మండల పరిధిలోని కీరియా తండా పంచాయతీ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోడ గౌతమి కి కనీసం ఒక్క ఓటు కూడా పడకపోవడం విశేషం

 

అయితే గౌతమికి ఒక్క ఓటు కూడా పడకపోవడం పట్ల మరి కనీసం ఆమె ఓటును కూడా ఆమెకు వేసుకోలేదా అని అటు గ్రామస్థులు.. మరియు అధికారులు ఆశ్చర్యపోయారు.

 

ఇంతకీ గౌతమి తన ఓటును ఎవరికి వేసినట్టు మరి అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram