గోల్డెన్ న్యూస్ / బూర్గంపాడు / కేంద్ర ప్రభుత్వం ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో వీబీ- జీ రాం జీ బిల్లు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ. మహాత్మ గాంధీ ఉపాధి హామీ చట్టం రద్దు చేయొద్దని బూర్గంపాడు మండలం పాండవుల బస్తీలో శుక్రవారం ఉపాధి కార్మికులతో జి-రామ్-జీ పత్రాన్ని తగలబెట్టడం జరిగింది.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ..
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని మార్చాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు పత్రాలని తగలబెట్టడం జరిగిందన్నారు.
ఇది దేశంలోనే ఉపాధి కార్మికులకు హక్కు ఈ హక్కుని తొలగించటానికి గాని పేరు మార్చడానికి గాని కేంద్ర ప్రభుత్వానికి మంద బలం ఉందని ఉపాధి హామీ చట్టాన్ని వీబీ జి రాం జి పేరుతో మార్చటం సరేంది కాదని కార్మికులకు ఉపాధి ప్రమాదంగా మారుతుందని ఇప్పటికే 27 లక్షల ఉపాధి కార్డులను దేశంలో తొలగించడం జరిగింది, అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తామని 40% రాష్ట్రాలు భరించాలని చెప్పటం చాలా దారుణం ఉంది కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రాల పైన భారం మోపితే రాష్ట్రంలో ఇవ్వలేనప్పుడు కేంద్రం నుండి ఇవ్వలేమని చెప్పటానికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని తిప్పి కొట్టాలని ఉపాధి కార్మికులందరూ ఏకం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు దేశంలోనే వలసలు గ్రామాల నుండి పోకుండా తన గ్రామంలోనే పని చేసుకొని బతకటం నికి తెచ్చిన ఉపాధి హామీ పని కార్మికులకు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు.
దేశం కోసం బ్రిటిష్ వాళ్ల పై అనేక పోరాటాలు చేసిన మహాత్మా గాంధీ పేరుని ఉపాధి నుండి తొలగించటం సరైనది కాదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బోయిన ఆదెమ్మ బర్ల మాణిక్యం గుమ్మడి గోవిందమ్మ పుట్టి నాంచారమ్మ పుట్టి చిట్టెమ్మ పుట్టి నాని పుట్టి లక్ష్మి బర్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.









