సర్పంచ్ సంబరాల్లో యువతి పై గ్యాంగ్ రేప్?

 

గోల్డెన్ న్యూస్ / మూసాపేట / మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో దారుణం జరిగింది. బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాలు ఒకవైపు జరుగుతుండగా.. మరొకవైపు 22 సంవత్సరాల యువతిని రైతు వేదిక వద్దకు ఆమెకు పరిచయం ఉన్న యువకుడు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఆమె రక్తస్రావంతో మృతిచెందిన ఘటన గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

 

తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు

 

సర్పంచ్ గెలిచిన ఆనందంలో గ్రామం పాటలు, కేకలు, బాణాసంచా సంబరాల్లో మునిగిపోయిన సమయంలో గ్రామానికి చెందిన యువకుడు ఆ యువతిని రైతు వేదిక కు తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడే ఆమెపై అత్యాచారం జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 

డిజె సౌండ్ కు స్పృహ కోల్పోయిందని  నాటకం

 

అత్యాచారంతో యువతి తీవ్రమైన రక్తస్రావానికి గురై స్పృహ కోల్పోయిన తర్వాత, ఆ యువకుడు ఆమె తల్లికి ఫోన్ చేసి, డీజే బాక్సుల సౌండ్ ఎక్కువగా ఉండడంతో మీ అమ్మాయి కుప్పకూలిపోయింది అని అబద్ధ కథ చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన- పిహెచ్సి వైద్యులు.

 

అవసరమైన ఏర్పాట్ల పేరుతో యువకుడు యువతి తల్లితో కలిసి మొదట స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లాడు పరిస్థితి అప్పటికే విషమించింది అని తెలుపగా, అక్కడి నుండి ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే యువతి మరణించినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని తిరిగి రైతు వేదిక వద్దకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.

 

ఉదయం పరిశీలించిన గ్రామస్తులు   గ్యాంగ్ రేప్ అనుమానిస్తున్నారు.

 

ఉదయం గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకుని పరిసరా లను పరిశీలించగా రక్తపు మరకలు, చించబడిన దుస్తులు, అలజడి జాడలు కనిపించాయి. దీనితో ఒక్క వ్యక్తి చేత కాదు ఒకటి కంటే ఎక్కువ మంది కలిసి అత్యాచారం చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

పోలీసుల చర్య ..ఒకరిని అదుపులోకి

 

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.ఇచ్చారు. ఒకరి కన్నా ఎక్కువ మంది మృతి అత్యాచారానికి ఒడిగట్టడం వల్ల చెందిందా..? లేక మత్తు పదార్థం ఇవ్వడం వల్ల దారుణం జరిగిందా..? అనే విషయాలపై డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్సె వేణు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.  పోస్ట్‌మార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, ఫోన్ రికార్డులు ఆధారంగా గ్యాంగ్‌రేప్ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

 

గ్రామంలో ఆగ్రహం కఠిన చర్యల డిమాండ్

 

ఈ సంఘటనతో వేముల గ్రామంలో ఉద్రిక్తత చెలరేగింది. మహిళలు, యువత ఎన్నికల సంబరాలు లైంగిక నేరాల వేదికగా మారకూడదని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఒక కుటుంబాన్ని కూల్చేసిన ఈ దారుణం ఆ గ్రామంలో ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram