తెలంగాణకు వాతావరణం శాఖ హెచ్చరిక!
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / తెలంగాణలో నేటి నుండి చలి తీవ్రత పెరుగుతుందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది, ఈరోజు నుంచి జనవరి 12వ తేదీ వరకు తీవ్ర చలిగాలులు వీస్తాయని,పేర్కొన్నారు పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 25 -26 డిగ్రీల మధ్య నమోదవుతా యని అంచనా వేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా పొగ మంచు ఉంటున్న చలి తీవ్రత తగ్గిన విషయం పాఠకులకు తెలిసింది,
గత కొద్దిరోజులుగా తెలంగాణ జిల్లాల్లో కాశ్మీర్ వాతావరణం కనిపిస్తుంది, కొన్ని జిల్లాలను పొగ మంచుతో కమ్మేసింది ప్రజలను గజగజ వణికించిన చలి తీవ్రత ప్రస్తుతం కొంత మేర తగ్గుముఖం పట్టింది. ఇటీవల అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయి రికార్డు స్థాయి చలి నమోదైనప్ప టికీ, గత రెండు రోజుల నుండి వాతావరణంలో మార్పులు రావడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.
అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాల పరిస్థితులు ఉన్నప్పటికీ, సంక్రాంతి పండుగ సమయానికి చలి మళ్లీ తన ప్రతాపం చూపే అవ కాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా రు. సంక్రాంతి తర్వాత జనవరి చివరి వారం నుండి మాత్ర మే శీతాకాలం క్రమం గా వీడుకోలు పలుకుతూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయ ని విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు , ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నాయి. వీటి ఫలితంగా వచ్చే మూడు రోజుల వరకు తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావ రణం ఏర్పడే అవకాశం ఉంది.
రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకునే అవ కాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మొత్తానికి రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తు తానికి భారీ ఉష్ణోగ్రతల తగ్గుదల లేకపోయినప్ప టికీ, పొడి వాతావరణం , పొగమంచు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పండుగ నాటికి చలి మళ్లీ పెరిగే సూచనలు ఉండ టంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.









