ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేత

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం / సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మండలం లోని  తాటిగూడెం గ్రామపంచాయతీలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ , స్థానిక కమిటీ ఆధ్వర్యంగా ముగ్గుల పోటీ కార్యక్రమంను నిర్వహించారు… ముఖ్య అతిథిగా పినపాక  శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ముగ్గుల పోటీలు వెలికితీస్తాయన్నారు. ఈ కార్యక్రమానికి మండల నూతన సర్పంచులు తాటిగూడెం గ్రామపంచాయతీకి చెందిన పూనెం శ్యామ్ కుమారి,ఉప సర్పంచ్ గాందర్ల రామనాథం, గొగ్గలి కృష్ణ, చందా శ్యామ్ కుమార్, పోలేబోయిన రామారావు ,మండల నాయకులు,గ్రామ పెద్దలు, జేఏసీ ఆదివాసీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, పోలీస్ డిపార్ట్మెంట్ కరకగూడెం , ఏడుల్ల బయ్యారం si లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram