కోయ మౌఖిక సాహిత్యం పై పరిశోధనకు గాను శ్రీ పగిడిద్దరాజు వంశస్థుడు అరెం అరుణ్ కుమార్ కు డాక్టర్ పట్టా ప్రకటించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం..
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం ఆదివాసి మారుమూల ప్రాంతమైన రాయన్నపేట గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ కోయ మౌఖిక సాహిత్యం పై చేసిన విస్తృతమైన పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక డాక్టర్ (పిహెచ్డి) పట్టాను ప్రకటించింది. జనవరి 9 వ తారీఖున ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. డా. యం. మాంతయ్య పర్యవేక్షణలో అరుణ్ కుమార్ కోయ తెగ మౌఖిక సాహిత్యం – పరిశీలన అంశంపై పరిశోధన చేశారు. ప్రకృతి ఒడిలో సాధారణమైన వ్యక్తిగా ఆశ్రమ పాఠశాలలో అడుగుపెట్టి, విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యావంతుడుగా,చారిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ పట్టా పొందడం యువతకు ఆదర్శనియం. చదువుకోవాలనే గొప్ప సంకల్పం ఉంటే పేదరికం, ఆర్థిక పరిస్థితులు అడ్డు కాదని నిరూపించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల శ్రమ, ప్రేమ, ఆశీస్సులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువుల ప్రోత్సాహం, సలహాలు సూచనలు, మంచి స్నేహితులు సహకారంతో గొప్ప విజయం సాధించాడు. ఈ సందర్భంగా సాహిత్యవేత్తలు , కవులు, కళాకారులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 620









