ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు మృతి

గోల్డెన్ న్యూస్ / తుంగతుర్తి / సూర్యాపేట జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు మహిళ ఉపాధ్యాయులు మృతి పొందారు.

సంక్రాంతి సెలవుల అనంతరం తొలి రోజు పాఠశాలకు వెళ్లిన ఆ ఉపాధ్యాయులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. శనివారం ఉదయం విధులకు వెళ్తున్న ఉపాధ్యాయుల కారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి వద్ద బోల్తా పడింది.  ఈ ప్ర‌మాదంలో ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలైన రావులపల్లి జీహెచ్ఎం గీత మెరుగైన చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ప్రవీణ్, సునీతలకు తీవ్ర గాయాలయ్యాయి.

 

నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు ఐదుగురు ఉపాధ్యాయులు విధులకు బయలు దేరారు. వీరి కారు అర్వపల్లి దగ్గరకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. పాఠశాల తెరిచిన మొదటి రోజే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో ఉపాధ్యాయులు తీయుట విషాదం నింపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram