ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా అమలాపురంలో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. ఫ్యూచరిస్టిక్ లుక్‌తో ఉన్న టెస్లా సైబర్ ట్రక్ అమలాపురం గడియార స్తంభం సెంటర్లో సందడి చేసింది. చెన్నైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పిల్లి ఆదిత్య రామ్ సంక్రాంతి పండుగ సందర్భంగా అత్తారింటికి టెస్లా సైబర్ ట్రక్‌లో రావడంతో జనం ఆసక్తిగా తిలకించారు.
కోనసీమలో జరిగే సంక్రాంతి సంబరాలకు తమిళనాడు రాష్ట్రం చెన్నైకు చెందిన వ్యాపార దిగ్గజం ఆదిత్య రామ్ అత్తారింటికి టెస్లా సైబర్ ట్రక్‌లో వచ్చారు. వాహనం వింతగా ఉండడంతో చూసేందుకు జనం ఎగబడ్డారు. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆదిత్య రామ్. ఆయన కోనసీమ అల్లుడు. పండుగ వేళ అత్తారింటికి వచ్చారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఆయన వాహనాన్ని చూసి జనం వింతగా ఉందంటూ ఆసక్తిగా చూసి సెల్ఫీలు దిగారు. కోనసీమకు వచ్చిన ఆదిత్యా రామ్‌కు అత్తింటి బంధువులు ఘనంగా స్వాగతం పలికారు. సెంటర్లో కారు ఆగడంతో అటుగా వెళ్లే జనం ఆగి కారుతో సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో కొంతసేపు అమలాపురం గడియారం సెంటర్లో ట్రాఫిక్‌కు అంతరాయం కూడా ఏర్పడింది. సెల్ఫీలు తీసుకున్న అనంతరం ఆదిత్య అక్కడి నుంచి ఆ కారులో బయలుదేరి అత్తారింటికి వెళ్లి పోయారు…
Post Views: 108









