మేడారం జాతర భద్రత ఏర్పాట్లను పరిశీలించిన సీఎం

మేడారం మహాజాతర భద్రత, పునరుద్ధరణ ఏర్పాట్లను స్వయంగా సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి

 

గోల్డెన్ న్యూస్/ తాడ్వాయి / తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద ఆదివాసీ పండుగగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క–సారలమ్మ వనదేవతల మహాజాతరకు సంబంధించి ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులతో కలిసి జంపన్న వాగు వరకు బస్సులో ప్రయాణించి, జాతర సందర్భంగా వస్తున్న లక్షలాది భక్తుల సౌకర్యాలను పరిశీలించారు.

 

జాతర భద్రతకు ప్రత్యేకంగా ఏర్పాట్లలో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి  పరిశీలించారు. పోలీసులు ఆ కాంక్షించిన ఏఐ (AI) సాంకేతికతతో వీటి పనితీరును వివరించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా, భక్తుల సౌకర్యం కోసం భద్రతను ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు సలహాలు సూచనలు చేశారు.

 

అతిపెద్ద ఆదివాసీ వారసత్వ సంపదకు ప్రతిబింబించేలా, రాతి ప్రాకారాలు, శిలాతోరణాలతో మేడారం వనదేవతల గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించిన పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. మూలవాసుల కోయ తెగల ఆచారాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన వాన దవతల ప్రాంగణం, దాదాపు 250 కోట్ల రూపాయల వ్యయంతో శరవేగంగా సాగిన పునరుద్ధరణ పనులను ఒక్కొక్కటిగా పరిశీలించారు.

 

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం ప్రతి ఏర్పాటులో భక్తుల సౌకర్యం, భద్రత మరియు వారసత్వాన్ని సమతుల్యంగా పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram