ఏపీలో ‘మనమిత్ర’ విప్లవం.. 50 లక్షల మందికి చేరువైన వాట్సాప్ సేవలు
అమరావతి :
ఏపీలో ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం 9552300009 నంబర్ 50 లక్షల మంది సేవలందుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఇందులో పాస్ పుస్తకాలు, పన్నుల చెల్లింపులు వంటి 900 రకాల సేవలు అందుబాటులో ఉండగా, త్వరలోనే వీటిని 1000కి పెంచనున్నారు. సామాన్యులకు పాలనను మరింత చేరువ చేస్తూ ఈ వాట్సాప్ సేవల వ్యవస్థ ప్రతి ఇంటికి ఒక చిరునామాగా మారిందని అధికారులు వెల్లడించారు.
Post Views: 18









