ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని బట్టుపల్లి రైతు వేదికలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ మబారక్, సీఎంఆర్ఎఫ్  చెక్కుల పంపిణీ మంగళవారం చేశారు. మండలంలో 32 మంది లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని ఆయన అన్నారు.అనంతరం వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే కి వివరించారు. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో MRO, MPDO, MEO, MPO, AE, APM విజయ లక్ష్మి, మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాల్గొన్నారు. బట్టుపల్లి సర్పంచ్ తోలెం రమాదేవి, కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత, మండలంలోని వివిధ పంచాయతీల సర్పంచ్లు పాల్గొన్నారు..

 

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram