డిజిపి ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ
గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ /తెలంగాణ రాష్ట్రంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ, దండకారణ్యంలో సాయుధ పోరాటం సాగిస్తున్న నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర డీజీపీ సమక్షంలో వీరు జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి కూడా లొంగిపోయారు. ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
Post Views: 293









