అడవికి నిప్పు పెడితే మనుగడకే ముప్పు

 – అడవులకు నిప్పు పెడితే కఠిన చర్యలు

–  రేగళ్ళ రేంజర్ జస్వంత్ ప్రసాద్

 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / ప్రస్తుత వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏజెన్సీ అటవీ ప్రాంతంలో ఎవరూ నిప్పు పెట్టవద్దని రేగళ్ల రేంజ్ అధికారి జస్వంత్ ప్రసాద్ అన్నారు. ముఖ్యంగా వేట కోసం అడవికి వెళ్లే వారు, నిప్పు పెట్టడం వల్ల తీవ్రమైన అనర్థాలు సంభవిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాలిన ఎండుటాకులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెడుతుండటంతో అటవీ సంపదకు నష్టం వాటిల్లుతోంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రేగళ్ల గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు .అడవులకు నిప్పు పెడితే అటవీ హక్కుల చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తప్పవని అవగాహన సదస్సులో తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ చిలకమారి శ్రీనివాసరావు, గ్రామస్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram