ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగారా!

ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల (ఒక కేంద్ర పాలిత ప్రాంతం) అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడింది. ఈ విషయం ఇవాళ సీఈసీ జ్ఞానేష్కుమార్  మీడియా సమావేశంలో ఎన్నికల వివరాలను వివరించారు.

 

కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఎన్నికల షెడ్యూల్ను సీఈసీ వెల్లడించారు. బెంగాల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేలా సీఈసీ నిర్ణయించారు.

 

అస్సాం, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమబెంగాల్లో మాత్రం ఏప్రిల్ 23, 29న రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని జ్ఞానేష్కుమార్ తెలిపారు. అయితే అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న వెలువడనున్నాయి. అలాగే ఆరు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram