‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అంశంపై ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ గడువును లోక్సభ పొడిగించింది. కమిటీ ఛైర్మన్ పీపీ చౌదరి ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు, రాజ్యాంగ సవరణ బిల్లు-2024, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లులపై నివేదిక సమర్పించే గడువును 2026 వర్షాకాల సమావేశాల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమగ్ర అధ్యయనం కోసం అదనపు సమయం కావాలని కమిటీ కోరడంతో స్పీకర్ ఈ మేరకు అనుమతిని ఇచ్చారు.
Post Views: 36









