ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

గోల్డెన్ న్యూస్ / తెలంగాణ / ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి, బాంబ్ స్క్వాడ్ బృందంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. భద్రతను కట్టుదిట్టం చేసి అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయా అని విస్తృతంగా పరిశీలిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram