అమెరికా, ఇజ్రాయిల్ , ఇరాన్ యుద్ధం నెలకొన్న కారణంగా చమురు సంక్షోభం నేపథ్యంలో కేంద్రం లాక్‌డౌన్ విధించనుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ స్పందించారు. ఆ ప్రచారాలను కొట్టిపడేశారు. అవి పూర్తిగా అవాస్తమన్నారు. కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదనే లేదన్నారు. ఇలాంటి ప్రచారాలు జరుగుతున్న సమయంలో ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రూమర్స్‌ను వ్యాప్తి చేసి, భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు బాధ్యతారహితం, హానికరమైనవని పేర్కొన్నారు.
Post Views: 174









