సహజవానురుల తయారీపై అవగాహన
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / కోనేరు సంస్థ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలో భట్టుపల్లి రైతు వేదికలో సోమవారం మండల స్తాయి సమావేశం జరిగింది.మండల కోఆర్డినేటర్ పగుట్ల వెంకటేశ్వరరావు ఫోకస్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా గ్రామ పంచాయతీలలో జరిగిన జీవనోపాధి కార్యక్రమాలు గురించి వివరించడం జరిగింది. ప్రాజెక్ట్ లో భాగంగా చిన్న సన్నకారు రైతులకు ఇచ్చిన ఎత్తిపోతల ఎత్తిపోతల పథకం ,సమీకృత వ్యవసాయ పద్ధతి, వ్యవసాయ ఉద్యానవన పంటలు, న్యూట్రీ గార్డెన్లు, ఏపీసి, విత్తన బ్యాంకులు,సహజ జీవ వనరుల తయారీకేంద్రంలు గురించి వివరించడం జరిగింది, రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి వారికి శిక్షణలు ఇవ్వడం జరిగింది అని మండల కోఆర్డినేటర్ పి పి టి ద్వారా వివరించడం జరిగింది మరియు వచ్చే 2026 _ 2027 ఆర్థిక సవత్సరం లో చేయబోయే పనులు గురించి కూడా వివరించడం జరిగింది.
ఈ సమావేశం లో మండల ఎంపీడీవో దేవ వర కుమార్ ప్రాజెక్ట్ కార్యక్రమాలు గురించి వివరించి రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకో అన్నారు
ఈ సమావేశంలో మండల స్తాయి అధికారులు ఎంపీడీవో దేవ వర కుమార్, అగ్రికల్చర్ ఆఫీసర్ చటర్జీ, ఆర్ ఐ కిరణ్,SERP ఏపిఎం వినోద్ క్రాంతి గారు, ఎలక్ట్రికల్ ఏఈ రాజశేఖర్ మరియు పద్మాపురం, తాటిగూడెం, రేగళ్ళ, చిరుమళ్ళ , అనంతారం, తాటిగుడెం, కన్నాయిగూడెం,గ్రామపంచాయతీల సర్పంచులు,సెక్రెటరీలు,కోనేరు సంస్త సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.










