గురుకుల పాఠశాలలో దాష్టీకం..
కడుపూనిండా అన్నం పెట్టమన్నందుకు..
మోకాళ్లపై కూర్చోబెట్టిన వైనం
ఆకలవుతుంది కడుపునిండా అన్నం పెట్టమన్నందుకు ఆ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులపై తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు.
మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్ నగర్‌లో నిర్వహిస్తున్న దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో సోమవారం రాత్రి భోజనం సమయంలో అన్నం సరిపోలేదు. ఆకలి అవుతుంది కడుపునిండా అన్నం పెట్టండి అని విద్యార్థినిలు ప్రాధేయపడ్డారు. ఆ ఒక్క మాటతోనే పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులపై ఆగ్రహించిన ప్రిన్సిపాల్ తిట్ల దండకం చేశారు.
అంతటితో ఆగకుండా మోకాళ్లపై కూర్చోబెట్టి విద్యార్థులను వేధించారని తెలిసింది. కనీసం ఆ తర్వాత నైనా భోజనం పెట్టారంటే అది కూడా లేకుండానే ఆ రాత్రంతా ఖాళీ కడుపుతో పడుకోబెట్టారు.
తల్లిలా ఆదరించాల్సిన ప్రిన్సిపాల్ విద్యార్థులను మానసిక శారీరక వేధింపులకు గురిచేస్తున్న తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతరం ఈ సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్‌తో పాటు మిగతా వాళ్లందరిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది









