గోల్డెన్ న్యూస్ /ములుగు/ తన భర్త ఐదేళ్లుగా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని న్యాయం కోసం మహిళ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది. ములుగు జిల్లా వెంకటాపూరo మండల తాసిల్దార్ గా గిరిబాబు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఐదేళ్లుగా భార్యా పిల్లలను పట్టించుకోకుండా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్య ఝాన్సీరాణి ఆరోపించారు. మరో మహిళతో ఉంటూ తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను తీసుకొచ్చి తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆమె వేడుకున్నారు.
Post Views: 110









