గోల్డ్ న్యూస్ / హైదరాబాద్ /నగరంలో టాస్క్ ఫోర్స్, నాంపల్లి పోలీసుల సంయుక్త ఆపరేషన్ ముగ్గురు నిందితులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 34.03 లక్షల విలువైన ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. డెలివరీకి వెళ్తున్న సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డెలివరీ బాయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ రాకెట్ ను ఛేదించారు. ప్రధాన సూత్రధారి ఇంటి దగ్గర భారీగా ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా బుకింగ్స్ తీసుకుని.. రాపిడో, పోర్టర్ ద్వారా డెలివరీలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఢిల్లీ నుంచి పార్సిల్ ద్వారా సరఫరా అవుతున్నట్లు విచారణలో తేలింది.దీనిపై మరింత లోతైన దర్యాప్తు జరపనున్నట్లు చెప్పారు••
Post Views: 11








