రైతులపై వివక్ష చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలి.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చెయ్యాలి..

కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య.

 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఆదివారం జరిగినా సమావేశం లో మండల అధ్యక్షులు రావుల సోమయ్య  మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చినాక రైతులకి 1 ఎకరాకు రైతుబంధు రూ .10000/—రైతుకు రైతుభిమారూ . 500000/—24 గంటల వ్యవసాయ కరెంట్ ఇలా రైతులకు అందించడం జరిగింది.. అలాగే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించు కోకుండా రైతులకు సమయానికి రైతుబంధు వెయ్యకుండా రైతు బోనస్ లేకుండా ఒడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యకుండా మోసం చేస్తూ కౌలు రైతులకు రూ.12000/—ఇస్తామని  గద్దెనెక్కేదాకా ఎన్నో మోసపురితమైన హామీలను ఇస్తూ ముఖ్య మంత్రి స్థాయి లో రేవంత్ రెడ్డి గారు ఉండి దేవుళ్ళ మీద ఒట్టు మీద ఒట్టు వేస్తూ తమ ఇష్టరీతిలో వ్యవరిస్తూ రైతు ల యొక్క జీవన సరళిని తెలుసుకోకూడా ఎన్నో మాయ మాటలు చెప్తూ కాలం వెళ్ళదిస్తూ వస్తున్నారు.. ఇకనైనా రైతులపట్ల సకాలంలో స్పందించి. రైతులకు సరైన న్యాయం చెయ్యలేని యడల రైతులపక్షాన పోరాటం ఉదృతం చేస్తామని BRS పార్టీ రైతులకు ఏప్పుడు అండగా ఉంట్టుందని. ఈ సందర్బంగా తెలియజేయ్యడం జరిగింది.ఈకార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు పోగు వెంకటేశ్వర్లు ప్రధానకార్యదర్శి బుడగం రాము మాజీ సర్పంచ్ ఊకె రామనాధం బైరిశెట్టి చిరంజీవి ఏళ్ళు రామకృష్ణ రెడ్డి రావుల కనకయ్య మాజీ సర్పంచ్ లు పాయం నరసింహారావు కొమరం విశ్వనాధం చందా పాపారావు మరియు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram