ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్ /తెలంగాణ / ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన 17 ఏళ్ల సౌజన్య అనే విద్యార్థిని మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉట్నూర్‌లోని ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ఆమె, ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో తీవ్రంగా కలత చెందింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అందరితో కలివిడిగా ఉండే సౌజన్య ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram