గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / తెలంగాణ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో ఒక వింత ఆచారం అనాదిగా వస్తుంది. గ్రామస్తులు ఆలయం ముందు కూర్చొని తమ తలపై కొబ్బరికాయలు పెట్టి పూజారితో పగులగొట్టిస్తున్నారు. రజకుల ఆరాధ్య దైవం మడేలయ్య స్వామి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈ ఆచారాన్ని నిర్వహిస్తున్నారు. సూర్యుడు చూడని నీటితో స్వామివారికి బలిస్తే అంతా మంచి జరుగుతుందని గ్రామస్తుల ప్రగాఢ నమ్మకం. ఈ వేడుకలు చూడటానికి స్థానికులతో పాటు పక్క గ్రామాల ప్రజలు కూడా భారీగా తరలివస్తున్నారు.

Post Views: 15








