కంటతడి పెట్టించిన హృదయ విధాకర ఘటన
గోల్డెన్ న్యూస్ /మణుగూరు /రోజురోజుకు మానవ సంబంధాలు ప్రేమానురాగాలు మంట కలిసి పోతున్నాయి కన్న ప్రేమకు కళంకం తెచ్చేలా కొందరు తల్లులు వ్యవహరిస్తున్నారు.
ఈ లోకంలో కన్న ప్రేమకు మించినది ఏదీ లేదు అంటారు చాలా మంది. కానీ కొందరు మాత్రం నవజాత శిశువుల పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు. కన్నవారే తమ పేగు బంధాన్ని తెంపుకుని తమ పసికందుల ను నిస్సహాయ స్థితిలో వదిలివేస్తున్న సంఘటనలు నిత్యం కోకొల్లలుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా అటువంటి మరో దారుణ ఘటన గుట్ట మల్లారం స్మశాన వాటిక లో చోటుచేసుకుంది ఆరు నెలల పసి పిండాన్ని వదిలివేసిన హృదయవిదారక ఘటన స్థానికులను కన్నీళ్లు పెట్టించింది. వివరాల్లోకి వెళితే..
ఏ తల్లి కన్న బిడ్డో.. క్షణికావేశంలో చేసినా ఆ తల్లి తప్పో లేక ఏ కాంమాంధుడి చేతిలో మోసపోయిందే తెలియదు కాని నవ మాసాలు మోయాల్సిన పసి గుడ్డు (ఆడ శిశువు) అడ్డు తొలగించుకో వాలనుకున్నారు. అభం శుభం తెలియని ఆరు నెలల పిండాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గుట్ట మల్లారం వైకుంఠ ధామం స్మశాన వాటిక లోని బాత్రూం లో వదిలే సి వెళ్లారు. ఈ అమానవీయకర సంఘ టన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూ రు మండలం గుట్ట మల్లారం పంచాయ తీలోని స్మశాన వాటిక దగ్గర శనివారం ఉదయం చోటు చేటు చేసుకుంది. గమ నించిన స్థానికులు అధికారులకు సమా చారమిచ్చారు. కాగా, ఎవరైనా పిల్లలు వద్దనుకుంటే తమకు సమాచారం ఇవ్వాలని బాలల పరిరక్షణ అధికారులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నా రు. అంతేతప్పా రోడ్లపై అనాథలుగా చిన్నారులను వదిలివెళ్లడం సరైంది కాద న్నారు. పిల్లలు లేని వారికి చట్టబద్ధంగా అందజేస్తామన్నారు.








