కరకగూడెం మండలంలో మద్యం మాఫియా
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని మద్యం వ్యాపారుల కనుసన్నల్లో నడుస్తున్నా బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని ఆదివాసి సంఘాల (JAC)కరకగూడెం మండల శాఖ అధ్యక్షులు గోగ్గల కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు..ఈ విషయమై
అధికారులు స్పందించకుంటే ఆదివాసి సంఘాల (JAC )కరకగూడెం మండల శాఖ ఆధ్వర్యంలోఆధ్వర్యంలో అన్ని బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించడం జరుగుతుందనీ
హెచ్చరించారు..కరకగూడెం మండలంలో మద్యం శాఖ అధికారులు, మద్యం వ్యాపారులు వారి మనసులతో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపులను అరికట్టాకుండ చోధ్యం చూడటాన్ని అధికారులును అనుమానించల్సి వస్తుందనీ. జేఏసీ కరకగూడెం మండల శాఖ అధ్యక్షులు గోగ్గల కృష్ణ పేర్కొన్నారు. కనీస నిబంధనలు పాటించడం లేదని అడుగు అడుగునా ఎటు చుసిన బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయని. మద్యం షాపుల్లో అయితే MRP ధరలకే విక్రయించాల్సి వస్తుందనీ. మద్యం వ్యాపారులే బెల్ట్ షాపుల్లో అయితే ప్రతి బాటిల్ కి 50 రూపాయలు అదనంగా పెంచి విక్రయించొచ్చని. మద్యం షాపుల్లో లేని అన్ని రకాల బ్రాండ్స్, బెల్ట్ షాపుల్లో కి పంపించి మద్యం ప్రియులను విచ్చాలవిడిగా దోచుకుంటున్నారనీ. ఈ దోపిడీనీ అరికట్టాలనీ జేఏసీ మండల కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. బెల్ట్ షాపులు నియంత్రణ పై మద్యం శాఖ అధికారులు కనీస ద్రుష్టి కూడా పెట్టడం లేదని అన్నారు. మద్యం వ్యాపారులు ఇష్టరాజ్యంగా వ్యవహారిస్తూ ఉంటే అధికారులు చోద్యం చూడటం తగదన్నారు. మద్యం వ్యాపారులకు బెల్ట్ షాపులకు ఉన్న లింకు ప్రజలకు అర్ధం అవుతున్న అధికారులు మాములు మత్తులో ఏమి పట్టనట్టు వ్యవహారిస్తున్నారనీ వాపోయారు, బెల్ట్ షాపులు రద్దు కోసం యువత తో అన్ని గ్రామాల్లో ఉద్యమం కార్యాచరణ ప్రణాళిక ప్రక్రియ ఏర్పాటు చేస్తాం అని పేర్కొన్నారు…ఈ కార్యక్రమం లో ఆదివాసీ సంఘాల సమన్వయ (జేఏసీ) కమిటీ మండల అధ్యక్షులు గోగ్గల కృష్ణ, ప్రధాన కార్యదర్శి పోలే బోయిన ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.








