భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా శ్రీమతి డి. వాసంతి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) శ్రీ శంభు ప్రసాద్ తో పాటు కార్యాలయ సిబ్బంది పుష్ప గుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు.వాసంతి జిల్లా బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె కలెక్టర్ కు మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు చేపడతానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ఫలితాల పెంపు, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల సమర్థవంతంగా అమలు చేసేందుకు, ఉపాధ్యాయుల సమన్వయంతో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. విద్యా రంగ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని నూతన డీఈఓకు శుభాకాంక్షలు తెలిపారు.








