అన్నపూర్ణ కంపెనీ విత్తనాలని చెప్పి. జెకే విత్తనాలు అంటగట్టిన కట్టిన వైనం.
10 క్వింటాళ్ల దిగుబడి కి హామీ ఇచ్చారు . దిగుబడి వచ్చింది మూడు క్వింటాలు మాత్రమే లేదు..!
న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటున్న బాధిత రైతులు.
రిటన్ సీడ్స్(వరి మొక్కజొన్న మిర్చి.) తక్షణమే నిర్మూలించాలని ఆదివాసి జేఏసీ అధ్యక్షులు గొగ్గల కృష్ణ డిమాండ్.
గోల్డెన్ న్యూస్/ కరకగూడెం / నకిలీ వరి విత్తనాలతో పలువురు రైతులు నష్టపోయారని, విత్తన కంపెనీ, డీలరుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం, పరిధిలోని తాటిగూడెం గ్రామానికి చెందిన కొమరం సత్యనారాయణ రైతు, అన్నపూర్ణ పేరుతో విత్తనాల సాగు చేపట్టి తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో పంట సాగు కోసం తమ గ్రామానికి వచ్చిన కంపెనీ ప్రతినిధులు ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని, ఎకరానికి రూ.70 వేల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, పెట్టుబడి కూడా కంపెనీయే భరిస్తుందని, పంటను తామే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని రైతు తెలిపారు.
ఆ హామీలను నమ్మి తాను 10 ఎకరాల భూమిలో సాగు చేయడానికి ముందుకొచ్చానని చెప్పారు. అన్నపూర్ణ కంపెనీ పేరుతో విత్తనాలు అందిస్తామని చెప్పి, జెకే సీడ్‌కు చెందిన విత్తనాలను అందజేశారని ఆరోపించారు. వాటిని 10 ఎకరాలకు సరిపడా సిద్ధం చేసుకుని, దుక్కి పనులు పూర్తి చేసి నాట్ల కోసం పొలాలను సిద్ధం చేశానని తెలిపారు.
అయితే కంపెనీ ప్రతినిధులు కేవలం నాలుగు ఎకరాల్లో మాత్రమే నాట్లు వేయించారని, మిగిలిన ఆరు ఎకరాల్లో సాగు చేపట్టకుండా నిలిపివేశారని రైతు ఆరోపించారు. ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించగా, సమయం దాటిపోయిందని, ఇక సాగు చేయొద్దని చెప్పారని వివరించారు. దీంతో సాగు కోసం సిద్ధం చేసిన భూమి నిరుపయోగంగా మారిందని, అందులో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకున్న భూమి కావడంతో యజమానులకు ముందుగానే చెల్లించిన డబ్బులు కూడా నష్టపోయానని పేర్కొన్నారు.
అంతేకాకుండా, సాగు చేసిన నాలుగు ఎకరాలకు కూడా కంపెనీ వాగ్దానం చేసిన విధంగా పెట్టుబడి అందించలేదని రైతు ఆరోపించారు. ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెప్పినప్పటికీ, మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా కష్టంగా వచ్చిందని తెలిపారు. ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని చెప్పినా, అనంతరం అలాంటి సౌకర్యం లేదని చెప్పారని వాపోయారు. మండలంలోని మరో రైతు పద్మాపురం గ్రామానికి చెందిన కోరగోట్ల విశ్వనాథం కూడా ఇలాగే జరిగిందని తెలిపారు.
ఇప్పటికే కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, తమకు న్యాయం చేయాల్సింది పోయి భూములు రాయించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాము ఎదుర్కొన్న నష్టాలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యలను అధికారులు వెంటనే పరిశీలించి, కంపెనీ ప్రతినిధుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని బాధిత రైతు ప్రభుత్వాన్ని కోరారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు సంబంధిత శాఖలు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేకుంటే మండలంలో ఆదివాసి రైతుల తోటి ఆందోళన చేస్తామని ఆదివాసి జేఏసీ కమిటీ అధ్యక్షులు గొగ్గల కృష్ణ పత్రికా ప్రకటనలో తెలియజేశారు

ఈ విషయంపై అన్నపూర్ణ కంపెనీ సీడ్ కంపెనీతో చరవాణిలో గోల్డెన్ న్యూస్ మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.








