గోల్డెన్ న్యూస్/మహబూబ్ / నవాబ్‌పేట మండలం రుద్రారం సర్పంచ్ కావలి రవీందర్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక వినూత్న ఆఫర్‌ను ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పిస్తే, వారి ఇంటి పన్ను తానే చెల్లిస్తానని ఆయన హామీ ఇచ్చారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా నవాబ్‌పేటలో నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్ ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, ప్రైవేటు పాఠశాలల నుంచి పిల్లలను ఇక్కడి ప్రభుత్వ బడిలో చేర్పించే తల్లిదండ్రుల ఇంటి పన్ను తానే కడతానని ఆయన తెలిపారు. ఈ ఆఫర్‌తో స్పందించిన తల్లిదండ్రులు 14 మంది విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించారు.
గతంలోనూ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామంలోనూ ప్రభుత్వ బడులకు వెళ్తే ఇంటిపన్ను మాఫీతోపాటు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తీర్మానించారు.
Post Views: 14








